AP: పాలన గాలికొదిలేసి.. మ్యూజికల్ నైట్‌లో కూటమి పాలకులు ?
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా కొనసాగుతాయన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీకి ఎక్కువ సీట్లు రావడంతో… వాళ్లను ప్రశ్నించే నాధుడే లేకుండా పోయింది. ఏపీలో ఎన్ని అన్యాయాలు జరిగినా అసలు ప్రశ్నించే వాళ్లే కనిపించడం లేదు.. జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉండకుండా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. వైసిపి నేతలను వరుసగా అరెస్టు చేస్తున్న నేపథ్యంలో… భయంతో కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో… మహిళలపై దారుణాలు, కిడ్నాప్లు అలాగే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

Trolling On Chandrababu and pawa kalyan
ఇంత జరుగుతున్నా కూడా… సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు స్పందించడం లేదు అటు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి దక్షిణాది రాష్ట్రంలో ఉన్న ఆలయాల చుట్టూ తిరుగుతుంటే… చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్ నేపథ్యంలో విజయవాడలో మ్యూజిక్ నైట్ కూడా ఏర్పాటు చేశారు కూటమినేతలు. ఇందులో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు పాల్గొని ఎంజాయ్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.