Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని అవమానించిన జీవన్ రెడ్డి ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా అవమానించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. తాజాగా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సభ నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ నేతలందరూ రావడం జరిగింది.

Jeevan Reddy insulted CM Revanth Reddy
అయితే అప్పటికే స్టేజి పైన కూర్చున్న జీవన్ రెడ్డి… సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా లేచి నిలబడలేదు. మిగతా నేతలు అందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు పెడితే… జీవన్ రెడ్డి మాత్రం తాను ఎవరికీ భయపడేది లేదన్నట్లుగా కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… గులాబీ పార్టీ నేతలు దాన్ని వాడుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు గౌరవమే లేదంటూ గులాబీ పార్టీ సోషల్ మీడియా కోడై చూస్తోంది.
ఇది ఇలా ఉండగా ఐదు సంవత్సరాల కిందట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ… అభ్యర్థిని ఓడించారు జీవన్ రెడ్డి. కానీ ఈసారి జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ రాలేదు. అతని స్థానంలో…. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
https://twitter.com/pulsenewsbreak/status/1894340704807391747