The Paradise: బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే.. ది ప్యారడైజ్ మూవీ ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడా.?
The Paradise: ఇండస్ట్రీలోని కొంతమంది హీరో, హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు కథలు రాస్తూ ఉంటారు. కథ పూర్తయ్యాక ఆ హీరో హీరోయిన్ కు కథ చెప్తే వారు రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. రిజెక్ట్ కు కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆ సినిమాను వద్దనుకున్న తర్వాత మరో హీరో ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంటే ఆ సినిమా ఎందుకు చేయలేకపోయాను రా బాబు అని చాలా ఫీల్ అవుతారట.. ఆ విధంగానే ఆ స్టార్ హీరో ఈ సినిమాను మిస్ చేసుకుని చాలా బాధపడుతున్నారట. మరి ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం..

The hero reject The Paradise movie
సాధారణంగా చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లను నమ్మరు. కానీ తెలుగు ఇండస్ట్రీలోని రవితేజ, నాని మాత్రం ఎప్పుడూ కొత్తవారిని ప్రోత్సహిస్తూ సూపర్ హిట్లు అందుకుంటున్నారు. ఇక ఇందులో మొదటి స్థానంలో ఉన్నారు నాని. జెర్సీ మూవీ ద్వారా గౌతమ్ తిన్న నూరి, దసరాతో శ్రీకాంత్ ఓదెలను పరిచయం చేశారు. అంతేకాకుండా శ్యాం సింగరాయ్ సినిమాతో రాహుల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. (The Paradise)
Also Read: Niharika: ఉగాదికి నిహారిక రెండో పెళ్లి ఫిక్స్.. నాగబాబు ఖుషి.?
ఆ విధంగా నాని ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ లిస్తూ తాను సూపర్ హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలా నానితో దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెల మరో సెన్సేషన్ మూవీ కూడా తీయబోతున్నారట. ముఖ్యంగా ఈ సినిమా కథను ఆయన సూర్య కోసం రాసుకున్నారట. ఈ కథను సూర్యకి వినిపిద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన పక్కన ఉన్న సిబ్బంది కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదట.

ఎంతో బాధపడ్డటువంటి శ్రీకాంత్ మళ్లీ ఈ సినిమా కథను నానికి వినిపించారట.. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే దీ ప్యారడైజ్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లీప్స్ విడుదలవ్వడంతో సూర్య అభిమానులు చూశారట. ఇంత అద్భుతమైన చిత్రాన్ని సూర్య ఎందుకు వదులుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని వదిలి కంగువా చిత్రం చేసి ఆయన స్టార్ స్టేటస్ ను తగ్గించుకున్నారని అంటున్నారు.(The Paradise)