Congress: గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు?
Congress: గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై.. హాట్ కామెంట్స్ చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ల భాష వాడుతూ… కాంగ్రెస్ను బండ బూతులు తిట్టారు.

Congress expels Gudem Mahipal Reddy
డంప్ యార్డ్ బాధితులు తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరగా మహిపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు… మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని… లేక కూడా ఇచ్చారట.
అయితే గులాబీ పార్టీలో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలపై.. ప్రత్యేక ఫోకస్ పెట్టిన మీనాక్షి… ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి పై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందట. అతని పార్టీ నుంచి బయటికి పంపించాలని డిసైడ్ అయ్యారట. ఎవరైనా ఇలాంటి తప్పుదారి చేస్తే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని ఆమె చెబుతున్నారట.