Bananas: ఎండా కాలం అరటి పండ్లు తింటున్నారా…?


Bananas: మార్కెట్లో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది. ఇది సంవత్సరం పొడవునా లభించే పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ధరకు, చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అరటి పండులో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అరటి పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక అరటి పండు తినాలని వైద్యులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కొంతమంది మాత్రం అరటిపండు తినడానికి అసలు ఇష్టపడరు. అయితే అరటిపండు ఎలాంటి వారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…. డయాబెటిస్ పేషెంట్లు అరటి పండును అసలు తినకూడదు.

Health Issues With Bananas

ఎందుకంటే ఇందులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దానివల్ల షుగర్ అమాంతం పెరుగుతుంది. అలాంటివారు అరటి పండు అసలు తినకపోవడమే చాలా మంచిది. అరటి పండులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువును వేగంగా పెంచుతాయి. బరువు తగ్గాలని ఆలోచనలో ఉన్నవారు అరటి పండ్లు తిన్నట్లయితే అధికంగా బరువు పెరుగుతారు. అందుకే అరటి పండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. కొంతమందికి అరటిపండు తిన్నట్లయితే అలర్జీ సమస్యలు వస్తాయి. దీనిపైన చర్మం పైన దురద, అలర్జీ, వాపు సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటివారు అరటి పండుకు దూరంగా ఉండటమే మంచిది. అరటిపండు తినడం వల్ల మైగ్రేన్ సమస్యలను ప్రేరేపిస్తుంది.

Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?

తరచూ తలనొప్పి సమస్యలతో బాధపడేవారు అరటిపండును తినకపోవడమే మంచిది. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్ర సంబంధ సమస్యలను అధికం చేస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి అరటిపండు అసలు తినకూడదు. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అరటిపండును ముట్టుకోకపోవడమే మంచిది. అయితే చిన్నపిల్లలకు మాత్రం ప్రతిరోజు ఒక అరటిపండును తప్పకుండా తినిపించాలి. దానివల్ల వారు బరువు సులభంగా పెరుగుతారు. చురుగ్గా తయారవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండు తినిపించడం వల్ల చిన్న పిల్లలు కూడా దాని రుచికి అలవాటు పడి దీనిని తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. అందుకే చిన్న పిల్లలకు ప్రతిరోజూ ఒక అరటి పండును తినిపించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *