Salman Khan: ఆ హీరోయిన్ పై సల్మాన్ ఖాన్ క్రష్.. లవర్స్ మధ్య చిచ్చు పెడతాడా.?

Salman Khan: బాలీవుడ్ బడా స్టార్ సల్మాన్ ఖాన్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు.. ఈయనను కండల వీరుడుగా పిలుస్తారు. అలాంటి సల్మాన్ ఖాన్ ఎంత వయసు వచ్చినా కానీ, ఇప్పటికీ ఒక యంగ్ హీరోలా కనిపిస్తూ అద్భుతంగా నటిస్తారు.. ఇక ఈయన సినిమాలో ఎంత పాపులారిటీ సాధించారో ఎఫైర్లలో కూడా అంతే దూసుకుపోతున్నారు. ఆయన సీనియర్ హీరోయిన్ల నుంచి ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోయిన్ల దాకా చాలామందితో రిలేషన్ పెట్టుకున్నారు.
Salman Khan crush on that heroine
అయితే ఈ బడా హీరో తాజాగా యంగ్ స్టార్ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆమె ఎవరు వివరాలు చూద్దాం.. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తెలుగు హీరోయిన్ పూజా హెగ్డేపై మనసు పారేసుకున్నారని వార్తలు వినిపించాయి.. ఇది మరువక ముందే మరో యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నపై కూడా మనసు పారేసుకున్నారని ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ రష్మికతో కలిసి ‘సికిందర్’ అనే మూవీలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. (Salman Khan)
Also Read: Aamir Khan: అమీర్ ఖాన్ ఎఫైర్ పై కూతురు ఫైర్.. కోపంతో అలాంటి పని.?
ఈ చిత్రాన్ని మురుగదాస్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ రంజాన్ కానుకగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇదే తరుణంలో తాజాగా సినిమా గురించి సల్మాన్ ఖాన్ తో ఉన్న రిలేషన్ గురించి రష్మిక మందాన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. సల్మాన్ ఖాన్ చాలా పెద్ద నటుడు.. అయినా ఆయనకు ఆ గర్వం ఉండదు.. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు.. నాకు ఆరోగ్యం బాగా లేకపోతే తన ఇంటి నుంచే భోజనం తెప్పించి మరీ నాకు వడ్డించారు.

ఆయనను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.. ఈ విధంగా సల్మాన్ ఖాన్ షూటింగ్ సమయంలో రష్మికపై చూపించినటువంటి అమితమైన ప్రేమను నేషనల్ క్రష్ బయట పెట్టడంతో నేటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. ఆయన నీపై క్రష్ పెంచుకున్నట్టున్నారు.. అందుకే అంత కేరింగ్ గా చూసుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. కొంపదీసి నువ్వు కూడా ఆయన వలలో పడి విజయ్ దేవరకొండను మోసం చేస్తావా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Salman Khan)