Potato: బంగాళ దుంపలు తింటున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త..?
Potato: బంగాళదుంపలను ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగాళాదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఆలూ బిర్యానీ, ఆలూ ఫ్రై ఇలా చాలా రకాల ఆహార పదార్థాలలో బంగాళాదుంపలను వాడుతూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కొంత హాని కలుగుతుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మొలకెత్తిన, పచ్చగా మారిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి హానికరం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. Potato
Health and Nutrition Benefits of Potatoes
బంగాళదుంపలను మార్కెట్ నుంచి కొన్న వెంటనే చాలామంది ఇంట్లో నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇది తొందరగా పాడవవు చవకగా దొరుకుతాయని అనుకుంటారు. ఇంట్లో చాలా రోజులపాటు నిల్వ చేసిన బంగాళాదుంపలకు చాలా మొలకలు వస్తాయి లేదా పచ్చగా మారిపోతాయి. అయితే ఇలా మొలకెత్తిన లేదా పచ్చగా మారిన బంగాళదుంపలను చాలామంది తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. Potato
Also Read: Couple Love: కొత్తగా పెళ్లయిన వారు… ఈ టిప్స్ పాటిస్తే… పండగే ?
చాకోనిన్, సోలానిన్ పదార్థాలు ఉత్పత్తి అవ్వడం వల్ల ఇవి శరీరానికి విష పదార్థాలను చేకూరుస్తాయి. దానివల్ల వాంతులు, వికారం, కడుపునొప్పి, వీరేచనాలు వస్తాయి. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి, బిపి పెరగడం లేదా తగ్గడం, జ్వరం, తల తిప్పడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Potato