Sreeleela: శ్రీలీల రూమ్ లో స్టార్ హీరో.. ఏం జరుగుతుంది..?
Sreeleela: లేటుగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ గా ఎదుగుతోంది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాల్లో చేస్తూ స్టార్ హోదా సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రీ లీల.. చూడటానికి క్యూట్ గా చిన్నపిల్లల కనిపించే శ్రీ లీల ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలతో కూడా తెరను పంచుకుంది. ఈ విధంగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా హీరో నితిన్ తో ఒక హోటల్ రూమ్ లో ప్రత్యక్షమైంది.
Star hero in Sreeleela room
ఇద్దరు కలిసి అలాంటి పని చేస్తూ నవ్వుకుంటూ బయటకు వచ్చారు.. మరి ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తాజాగా రాబోతున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమాలో ముందుగా రష్మిక మందన హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆమెకు పుష్ప2 డేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అడ్జస్ట్ చేసుకోలేక సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఈ మూవీ యంగ్ హీరోయిన్ శ్రీలీల వచ్చి పడింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అయి మంచి హిట్ సాధించింది.(Sreeleela)
Also Read: SKN: ఇక పిసుక్కోండి అంటూ మెగా ఫ్యాన్స్ కి బేబీ నిర్మాత వార్నింగ్.. ఎందుకంటే..?
అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న తరుణంలో ఒక హోటల్ రూమ్ లో నితిన్ ను ఆటపట్టించింది శ్రీలీల. అయితే హోటల్లో హీరో గది అని రాసి ఉండే గదిలో నితిన్ వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత హీరో అని రాసి ఉన్న దగ్గర హీరోయిన్ అని రాసి అందులోకి దూరింది శ్రీ లీల.. ఏంటి మీరు నా రూంలో ఉన్నారంటూ నితిన్ ను అడిగింది.. వెంటనే కన్ఫ్యూజ్ అయినటువంటి నితిన్, నేను నీ రూమ్ లో ఉండడం ఏంటి, నా రూమ్ లోనే ఉన్నాను.
లేదు రూమ్ బయటకు రండి ఏం రాసిందో చూడండి అంటూ శ్రీ లీల అన్నది. బయటకు వచ్చిన నితిన్ అంతా గ్రహించి హీరో అనే నాలుగు అక్షరాల ముందు ఇన్ అని పెట్టి ఫ్రాంక్ చేసింది శ్రీలీల.. వెంటనే ఆ అక్షరాలను తుడిచేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు నితిన్. ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతుంది..అయితే శ్రీ లీల నితిన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.(Sreeleela)