Chandrababu: రాజధాని అమరావతిపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం ?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు. Chandrababu
Chandrababu key decision On Amaravathi
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్టమెంట్లు, ఐఎఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలపడం జరిగింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. Chandrababu
Also Read: WTC: టీమిండియా WTC చేరాలంటే… ఇలా జరగాల్సిందే ?
అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయటంతో పాటు శాఖమూరు, నీరు కొండవద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్లు సీఆర్డీఏ ఖర్చు చేయబోతుందన్నమాట. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు లో భాగంగా 12 టవర్లుతో 1200 అపార్టమెంట్ల నిర్మాణం కోసం 984 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్వర్క్ కోసమని ఫండ్స్ కేటాయించారు. సీవరేజి, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు కోసమని ఫండ్స్ కేటాయించారు.. మొత్తంగా 20 సివిల్ పనులకు గానూ 11,467 కోట్ల మేర వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపింది చంద్రబాబు నాయుడు సర్కార్. Chandrababu