“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం 2 సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారట.

స్క్రిప్ట్ రెడీ కాగానే రామ్ చరణ్ కు నెరేట్ చేస్తారని తెలుస్తోంది. రంగస్థలం కథ ముగిసిన చోటు నుంచి కొత్త కథ ప్రారంభం కానుందని తెలుస్తోంది. రంగస్థలం సీక్వెల్ ఓకే అయితే టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మించనుంది. ప్రస్తుతం రంగస్థలం 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు రామ్ చరణ్ పెద్ది సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్ లోకి రానుంది.

Share your love