దసరా టార్గెట్ పెట్టుకున్న సుకుమార్

రామ్ చరణ్‌, సుకుమార్ ది సూపర్ హిట్ కాంబో. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లు కలిసి మరో చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్‌ తో సినిమా చేస్తానని ప్రకటించారు కానీ కథ సిద్ధంగా లేదు. ప్రస్తుతం కథపై సుకుమార్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. తన టీమ్ తో దుబాయ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దసరాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చరణ్‌ కి వినిపించనున్నాడని టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.

మరోవైపు చరణ్‌ పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. యాభై శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. పెద్ది తర్వాత సుకుమార్ తోనే సినిమా చేస్తున్నట్లు రామ్ చరణ్ చెబుతున్నారు. కానీ సుకుమార్ కథ రెడీ చేయడం ఆలస్యమైతే మాత్రం ప్లాన్ మారిపోతుంది.

Share your love