లవ్ లీ రొమాంటిక్ సాంగ్ ‘నాలో నేను..’ రిలీజ్

లవ్ మూవీస్ లో రొమాంటిక్ సాంగ్స్ హైలైట్ అవుతుంటాయి. రొమాంటిక్ సాంగ్ లేని లవ్ స్టోరీ ప్రేక్షకులకు రుచించదు. ఇటీవల యాక్షన్ మూవీస్ బాగా పెరిగి లవ్ మూవీస్, రొమాంటిక్ సాంగ్స్ తగ్గిపోయాయి. ఆడియెన్స్ మిస్ అవుతున్న రొమాంటిక్ సాంగ్ లా రిలీజైంది నాలో నేను పాట. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ట్రెండీ ట్యూన్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ పర్పెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సంజిత్ హెగ్డే ఈ సందర్భంలోని మంచి ఫీల్ క్యారీ చేస్తూ పాడాడు. పాటలో
సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీ బాగుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share your love