యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. ఈ చిత్ర టీజర్ లవ్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ఒక ట్రెండీ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్ తీసుకోవడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి మధ్య ఇంటిమేట్ సీన్స్ యూత్ ఆడియెన్స్ ను ఇన్ స్టంట్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి.
ఉద్యోగం లేకుండా చెన్నైలో ఇబ్బందులు పడుతున్న శివ అనే అబ్బాయికి కీర్తి అనే అమ్మాయి పరిచయం కావడం, వారిద్దరు ప్రేమలో ఒక్కటవడం టీజర్ లో ఆసక్తి కలిగించాయి. గత చిత్రాలతో చూస్తే ఈ శివ పాత్రలో సంతోష్ శోభన్ మెచ్యూర్డ్ గా కనిపించాడు. మానస వారణాసి ఎప్పటిలాగే తన బ్యూటీతో అట్రాక్ట్ చేసింది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ లవ్ స్టోరీని వీలైనంత పొయెటిక్ గా చెప్పేందుకు ప్రయత్నించాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా తెరకెక్కుతున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.





