Afghan Cricketers: పాకిస్తాన్ బాంబు దాడి…ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట‌ర్లు మృతి ?

Afghan Cricketers: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో పెను విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. పాకిస్తాన్ – అఫ్గానిస్థాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్ ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది పాక్. ఇక ఈ దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు, మరో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారు దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్, సిబాతుల్లాలుగా గుర్తించారు. Afghan Cricketers

3 Afghan Cricketers Among 8 Dead In Pakistani Airstrike Near Border

వచ్చే నెలలో పాక్, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్ సిరీస్‌లో అఫ్గాన్ తరపున జట్టులో ఈ ముగ్గురు క్రీడాకారులు ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ట్రై సిరీస్ నుండి తప్పుకున్న అఫ్గానిస్థాన్.. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ దాడిలో మా ముగ్గురు క్రికెటర్లు మృతి చెందారని పేర్కొంది. Afghan Cricketers

Also Read: Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో బాంబ్…

మొత్తం ఎనిమిది మంది మరణించారని తెలిపింది. చనిపోయిన వారిలో కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హ‌రూర్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే ముక్కోనపు టి20 సిరీస్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ఆ ట్రై సిరీస్ లో పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే తప్పుకుంటున్నామని వెల్లడించింది. Afghan Cricketers

Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_