Danish Kaneria: మోడీకి పాక్ మాజీ క్రికెటర్ మద్దతు.. సిజెపి నిరసనలపై విమర్శలు!!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ, ప్రధాని మోదీకి మద్దతు తెలిపాడు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలను టార్గెట్ చేస్తూ, వీటి వెనుక స్క్రిప్ట్ ఉందని డానిష్ కనేరియా ట్వీట్ చేశాడు.

Danish Kaneria’s Support for Modi

ఈ నిరసనల్లో రాముడిని, ప్రధాని మోదీని, బ్రాహ్మణులను దూషించడం common agenda అని కనేరియా విమర్శించాడు. పోలీసులపై కత్తులతో దాడులు చేయడం శాంతియుత నిరసనల పేరుతో జరుగుతోందని, ఇది పూర్తి సర్కస్ లాగా ఉందని ఆయన అన్నాడు. ఇలాంటి నిరసనలతో దేశ అభివృద్ధి ఆగిపోతుందని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.

NEET-UG పేపర్ లీక్ కేసులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడం, ఎడ్యుకేషన్ సిస్టమ్లో రిఫామ్స్ కావాలని CJP, వేలాది విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో చాలామంది గాయపడ్డారు. కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్షాలు ఈ నిరసనలకు సపోర్ట్ ప్రకటించాయి.

డానిష్ కనేరియా మాట్లాడుతూ, రైతుల నిరసనలు, ఇతర events అన్నీ కూడా అమెరికాతో ట్రేడ్ డీల్ అయ్యే ముందు జరగడం సందేహాన్ని కలిగిస్తోందని అన్నాడు. ప్రధాని మోదీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share your love