Team India: రెండో వన్డేలో పరాజయం.. గిల్ కెప్టెన్ గా పనికిరాడా?

Team India: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా (Team India) నిరాశపరిచింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలు, కీలక క్యాచ్‌లు డ్రాప్ చేయడం వంటివి పెద్ద మూల్యం చెల్లించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా (Australia) 2 వికెట్ల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Team India fails in must-win match

భారత్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) విలువైన ఇన్నింగ్స్ ఆడినా, మధ్యలో రన్‌రేట్ తగ్గిపోవడం టీమ్‌కి నష్టమైంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడినా, మ్యాథ్యూ షార్ట్ (74), రెన్ షా, కూపర్ (61)* రాణించారు. భారత్ ఫీల్డింగ్ వైఫల్యాలు — కేఎల్ రాహుల్ రనౌట్ మిస్, అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్, సిరాజ్ క్యాచ్ పొరపాటు — ఆస్ట్రేలియాకు విజయం దారితీశాయి.

మిచెల్ ఓవెన్స్ చివర్లో వేగంగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ పరాజయంతో భారత్ 2025లో మొదటిసారిగా వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయింది. ఇప్పుడు మూడో వన్డేలో సిడ్నీ వేదికగా టీమిండియా పోరాడనుంది. ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు మనం చూడొచ్చు. అయితే ఈవిధంగా మ్యాచ్ లు ఓడిపోవడం గిల్ కెప్టెన్సీ పై అనుమానాలను పెంచుతుంది. అభిమానులు గిల్ కెప్టెన్ గా పనికిరాడని సోషల్ మీడియా లో వాదిస్తున్నారు.

Share your love