Garlic: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కల్తీ అయిన ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక మరికొందరైతే ఎక్కువగా బయట ఆహారాన్ని తింటూ అనేక వ్యాధులకు తెచ్చుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అందులో మన ఒంటికి మేలు చేసే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీనిని తినడానికి ఎవ్వరూ పెద్దగా ఇష్టపడరు. ఇక మరికొందరికి అయితే వాసన కూడా పడదు. Garlic

Eating garlic has super benefits

కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లిని తీసుకోక తప్పదు. ఈ వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. ముఖ్యంగా వెల్లుల్లి తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటుతో సమస్యతో బాధపడేవారు తప్పకుండా వెల్లుల్లి తిన్నట్లయితే రక్తపోటు తగ్గుతుంది. ఇక ప్రస్తుత కాలంలో పొల్యూషన్ కారణంగా చాలామంది మొటిమలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. Garlic

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను అవమానపరుస్తున్న చంద్రబాబు.. ప్రతి చోట అదే పని ?

ఇక ప్రతి ఒక్కరికి చర్మం కాంతివంతంగా తయారవ్వాలంటే వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి గోరువెచ్చని నీళ్లలో ఆ గుజ్జుని కలుపుకొని ఉదయం పూట తాగినట్లయితే చర్మ సమస్యలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉన్న ముడతలు సైతం తొలగిపోతాయి. ఇక చాలామంది వర్షాకాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇక అలాంటి సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి రెబ్బలను ఒక పిరికెడు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగినట్లయితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి. Garlic

వెల్లుల్లిలో క్యాలరీలను కరిగించే శక్తి ఉంటుంది. ఇది చాలా సులభంగా బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక ఇందులో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ఇక ముఖ్యంగా బాలింతలు వెల్లుల్లి తినడం చాలా మంచిది. పూర్వకాలం నుంచే బాలింతలు వెల్లుల్లిని తినడం ప్రారంభించారు. ఇప్పటివరకు దానిని అదే విధంగా కొనసాగిస్తున్నారు. వెల్లుల్లి తిన్నట్లయితే పాలు ఎక్కువగా వస్తాయని పూర్వకాలం నుంచి మన పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ బాలింతలు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. Garlic