Rajasaab: రాజా సాబ్ లో 4 హీరోయిన్స్.. ప్రభాస్ రొమాన్స్ మామూలుగా ఉండదా..?
Rajasaab: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్.. ఈ సినిమా నుండి ఇప్పటికే ప్రభాస్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమా నుండి ప్రభాస్ పోస్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంది.అయితే ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ లేదు లేదు ఏప్రిల్ లోనే వస్తుంది అని నిర్మాతలు చెబుతున్నారు.
4 heroines in Rajasaab
అయితే తాజాగా ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ గురించి ఒక వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటికే ది రాజా సాబ్ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్,మాళవిక మోహనన్ లు కథానాయికలుగా నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరో హీరోయిన్ తో కూడా ప్రభాస్ రొమాన్స్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. (Rajasaab)
Also Read: Kajal: గుడ్ న్యూస్.. మళ్లీ తల్లి కాబోతున్నకాజల్..?
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. టాలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..మారుతి డైరెక్షన్లో వస్తున్న ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ సరసన నయనతార ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే నయనతార ఇప్పటివరకు స్పెషల్ సాంగ్ లో చేసింది లేదు.
కానీ మొట్టమొదటిసారి ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నిర్మాతలు నయనతార కి రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేసినట్టు వార్త వినిపిస్తున్నాయి.మరి చూడాలి ప్రభాస్ రాజాసాబ్ మూవీలో నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Rajasaab)