
Shreyas Iyer: టీమిండియా జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. త్వరలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరం కాబోతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై గాయం బారిన పడ్డ శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతడు కోలుకోవాలంటే కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందట. కానీ నవంబర్ 30వ తేదీ నుంచి ఈ టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. Shreyas Iyer
Shreyas Iyer is doubtful for the ODI series against South Africa
టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కేవలం 3 వన్డేలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నవంబర్ 25వ తేదీన జట్టును ప్రకటించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆలోపు ఎవరైతే ఫీట్ గా ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అయితే శ్రేయాస్ అయ్యర్ మరో 30 రోజుల వరకు గ్రౌండ్ లో అడుగు పెట్టడం కష్టమే. ఈ మేరకు వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. Shreyas Iyer
Also Read: Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!
ఈ లెక్కన చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే వన్డే సిరీస్ కు శ్రేయాస్ అయ్యర్ దూరం కాబోతున్నాడు అన్నమాట. ఇక ఈ టోర్నమెంట్ కు దూరమైతే మళ్లీ టీమిండియాలో అతడు ఛాన్స్ దక్కించుకోవడం చాలా కష్టమే అంటున్నారు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా ఆస్ట్రేలియా గడ్డపై క్యాచ్ పట్టబోయి కుప్పకూలాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో అతనికి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. Shreyas Iyer
Also Read: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్…




















