
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. అయితే అలాంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొనేందుకు ప్రత్యేక విమానంలో తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. YS Jagan
YS Jagan rappa rappa poster viral
ఇవాళ 12 గంటల ప్రాంతంలో నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే బేగంపేట విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి దిగిన సందర్భంగా భారీ స్థాయిలో వైసీపీ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తన అభిమానులతోనే జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ కోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. YS Jagan
Also Read : Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?
వీటిని చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఏపీకి చెందిన జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని ఇవాళ మరోసారి బయటపడింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందుకు వెళ్లగానే రకరకాల పోస్టర్లు కలకలం రేపాయి. ముఖ్యంగా రప్పా రప్పా పోస్టర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. 2029లో కూటమినేతలకు రప్పా రప్పా అంటూ ఓ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. YS Jagan
Also Read : Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?





