IND VS SA: SAతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు?

IND VS SA: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నవంబర్ 22వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ పూర్తిగా గానే వన్డే సిరీస్ మూడ్ లోకి రెండు జట్లు వెళ్తాయి. దక్షిణాఫ్రికా వర్సెస్ టీం ఇండియా మధ్య ఈనెల 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ ఎవరు అనే దాని పైన చర్చ జరుగుతోంది. IND VS SA

IND VS SA Who will be the captain for the ODI series against SA

మెడనొప్పి బారిన పడ్డ గిల్ వన్డే సిరీస్ కు దూరం కాబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. అటు వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ ఆడడం కష్టమే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి మరో కొత్త వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ ఇద్దరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. IND VS SA

Also Read : Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?

వన్డేలలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కేఎల్ రాహుల్ కు ఉంది. కాబట్టి అతనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్షర్ పటేల్ కు అవకాశం వస్తే, మరో కొత్త కెప్టెన్ జట్టుకు అయినట్లు అవుతుంది. అయితే కొంతమంది రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క సిరీస్ కోసమైనా రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. IND VS SA

Also Read : Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?