Telangana Elections: సర్పంచ్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన కూతురు.. ఆ కోపంతో తల్లి ఏం చేసిందంటే?

Telangana Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బంధాలు, అనుబంధాలు పని చేయవని ప్రూవ్ చేసిన ఆసక్తికర ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కన్నతల్లి గంగవ్వను, కూతురు పల్లెపు సుమ 91 ఓట్ల Majority తో ఓడించడం స్థానికంగా పెద్ద సంచలనం అయింది. బీసీ మహిళా కోటాలో రిజర్వ్ అయిన ఈ సీటుకు తల్లీకూతుళ్లు ఇద్దరూ పోటీ పడటం, చివరికి కూతురు విజయం సాధించడం గ్రామ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్ తీసుకువచ్చింది. ఇది నిజంగా రాజకీయాల్లో No Emotional Boundaries అన్న వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Daughter Defeats Mother In Telangana Elections

స్థానికుల కథనం ప్రకారం, ఈ రాజకీయ వైరం వెనుక పాత Personal Conflicts ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన యువకుడితో సుమ చేసిన Love Marriage కారణంగా తల్లి–కూతురు మధ్య విభేదాలు ముదిరాయని చెబుతున్నారు. ఈ కుటుంబ కలహాలు చివరికి రాజకీయ ప్రత్యర్థిత్వంగా మారి, తల్లిని కూతురు ఎన్నికల్లో ఓడించిన ఘటనగా మారింది. ఒకే ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో నిలవడం గ్రామస్థులను ఆశ్చర్యంలో ముంచేసింది.

ఈ ఫలితంపై సోషల్ మీడియాలో Netizens పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పదవుల కోసం రక్త బంధాలను కూడా పక్కన పెట్టే పరిస్థితి రావడం, ఇది కలికాలం నిదర్శనమని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తల్లిపై గెలిచిన ఆనందం సుమలో కనిపించినప్పటికీ, ఓటమిని తల్లి గంగవ్వ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో రాజకీయాల్లో Emotions Don’t Matter అన్న నిజం మరింత బలపడింది.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, దాదాపు 1.66 కోట్ల Voters తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ పూర్తయ్యేయగా, Second Phase Elections త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏది ఏమైనా, తిమ్మయ్యపల్లి ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో Trending Topic గా మారింది.

Share your love