
Jeevan Reddy Vs Sanjay Kumar: జగిత్యాల రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎక్కడైనా అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం మధ్య గొడవలు జరుగుతాయి. కానీ జగిత్యాల లో మాత్రం ఇద్దరు కూడా అధికారపక్షంలోనే గొడవ పడుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తనకు తెలియకుండా తన పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడని సంజయ్ కుమార్ పై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy Vs Sanjay Kumar
Jeevan Reddy Vs Sanjay Kumar Jagtial politics
అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రతిపాదించిన వాళ్లకు పదవులు రాకుండా సంజయ్ కుమార్ అడుగడుగునా అడ్డుకుంటున్నారట. అయితే ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. మాకు అడ్డం వస్తున్న వాడిని తొక్కుతామంటూ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై మరోసారి రెచ్చిపోయిన జీవన్ రెడ్డి… మున్సిపల్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అవకాశవాదులు అడ్డదారిలో వస్తే అడ్డంగా తొక్కుతామని హెచ్చరించారు. Jeevan Reddy Vs Sanjay Kumar
Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం ?
ఇక అంతకుముందు సంజయ్ ఎవడివి రా నువ్వు ? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తావా అంటూ ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. అయితే ఇప్పటివరకు సంజయ్ కుమార్ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. ఆయన సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వీళ్ళ మధ్య గొడవ ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ జగిత్యాల లో భూస్థాపితం కావడం గ్యారెంటీ అంటున్నారు ప్రజలు. Jeevan Reddy Vs Sanjay Kumar
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?




