Luxury Watch: రిచర్డ్ మిల్ వాచ్.. మెస్సీకి లగ్జరీ వాచ్ గిఫ్ట్ చేసిన అనంత్ అంబానీ!!

Luxury Watch:ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత్ పర్యటన ఇప్పుడు గ్లోబల్ హాట్ టాపిక్‌గా మారింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంతారా (Vantara) జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మెస్సీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విచ్చేశారు. ఒక Global Football Legend భారతదేశంలో పర్యావరణ ప్రాజెక్ట్‌ను సందర్శించడం విశేషంగా మారింది.

Anant Ambani Gifts Messi Luxury Watch

ఈ సందర్శన సందర్భంగా అనంత్ అంబానీ మెస్సీకి దాదాపు రూ.9.92 కోట్ల విలువైన Richard Mille RM 003 V2 Tourbillon వాచ్‌ను బహూకరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ Luxury Time Piece ధర సుమారు 1.1 మిలియన్ డాలర్లు. మెస్సీ ఈ కార్యక్రమానికి వాచ్ లేకుండా వచ్చారని, కానీ అనంత్ ఇచ్చిన Asia Edition వాచ్‌ను సందర్శన మధ్యలో ధరించి కనిపించారని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

అనంత్ అంబానీకి లగ్జరీ వాచీలపై ప్రత్యేకమైన passion ఉంది. ఈ రిచర్డ్ మిల్ వాచ్ అత్యంత precision, ఆధునిక engineering, మరియు ప్రత్యేక డిజైన్‌కు ప్రసిద్ధి. భూమి గురుత్వాకర్షణ ప్రభావం పడకుండా పనిచేయడం, రెండు time zones ఒకేసారి చూడగలగడం దీని ప్రత్యేకత. ఇవి limited edition కావడంతో ప్రపంచవ్యాప్తంగా అరుదుగా లభిస్తాయి.

వంతారా పర్యటనలో మెస్సీ అత్యాధునిక జంతు ఆసుపత్రులు, rehabilitation centersను ఆసక్తిగా పరిశీలించారు. గాయపడిన జంతువుల సంరక్షణలో అంబానీ కుటుంబం చేస్తున్న కృషిని చూసి ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. మెస్సీ–అనంత్ అంబానీ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో viral అవుతున్నాయి.