
Raja Saab:ప్రభాస్ సినిమా అంటేనే భారీ బడ్జెట్, భారీ బిజినెస్ అనే మాట ట్రేడ్‌లో సాధారణంగా వినిపిస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రారంభమైన రాజాసాబ్ (Raja Saab) మొదట ఒక medium range movie అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత ప్రాజెక్ట్ స్కేల్ పూర్తిగా మారిపోయింది. భారీ Visual Effects, అద్భుతమైన సెట్స్, విదేశాల్లో జరిగిన షూటింగ్ కారణంగా ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు పైగా చేరింది. హారర్ కామెడీ అయినప్పటికీ ప్రభాస్ స్టార్‌డమ్ వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.
Raja Saab Movie Business Creates Buzz
ప్రస్తుతం ట్రేడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజాసాబ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.200 కోట్లకు చేరుతోంది. ఆంధ్ర ప్రాంతంలో సుమారు రూ.85 కోట్లు, రాయలసీమలో రూ.40 కోట్లు, నైజాంలో రూ.70 కోట్ల వరకు డీల్స్ జరుగుతున్నట్లు టాక్. ప్రభాస్ మార్కెట్ బలంగా ఉండటంతో బయ్యర్లు ఆసక్తి చూపుతున్నా, ఇంత పెద్ద మొత్తాన్ని recover చేయడం సులువు కాదని విశ్లేషణలు చెబుతున్నాయి.
ముఖ్యంగా నైజాం ఏరియా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద risk గా మారింది. ఏపీలో benefit shows మరియు అదనపు రేట్లకు కొంత వెసులుబాటు ఉన్నా, తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవల కోర్టు కేసులు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల టికెట్ రేట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టత వచ్చింది. దీంతో నైజాంలో రూ.70 కోట్ల షేర్ టార్గెట్ సవాలుగా మారింది.
సంక్రాంతి రేసులో చిరంజీవి విశ్వంభర వంటి భారీ సినిమాలు పోటీలో ఉండటంతో options పెరుగుతున్నాయి. గవర్నమెంట్ నుండి ప్రత్యేక Government Order రాకపోతే, డిస్ట్రిబ్యూటర్లు డీల్స్‌ను revise చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.




