
Pranay Murder Case: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు అమృత బాబాయి శ్రవణ్ కుమార్ కు భారీ ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. Pranay Murder Case
Pranay Murder Case bail to sravan kumar
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే జీవిత ఖైదును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు శ్రవణ్ కుమార్. ఈ నేపథ్యంలోనే ఆ పిటీషన్ విచారణకు వచ్చింది. Pranay Murder Case
Also Read: Jagan: చంద్రబాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో కలిసి జగన్ భారీ స్కెచ్ ?
ఈ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు శ్రవణ్ కుమార్. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర హై కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అతని వయసు అలాగే జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా అమృత పైన శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు నిత్యం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. Pranay Murder Case
Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…




