Telangana: సిరిసిల్ల, సిద్దిపేట‌తో పాటు 10 జిల్లాల ర‌ద్దు ?

Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను రద్దు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. త్వరలో మళ్లీ జిల్లాల పునర్వ్యస్తీకరణ చేస్తామని అసెంబ్లీలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. Telangana

10 districts cancelled along with Sircilla and Siddipet Telangana

సిద్దిపేట సిరిసిల్ల నారాయణపేట ములుగు తో పాటు మరో ఆరు జిల్లాలను రద్దు చేసే ఆలోచనలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న జిల్లాలను పక్కనున్న పెద్ద జిల్లాలలో విలీనం చేసే విధంగా రేవంత్ రెడ్డి స్కెచ్ లు వేస్తున్నారట. లోక్సభ అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. Telangana

Also Read: Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న…

కొత్త జిల్లాలకు పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టబోతున్నారట. గులాబీ పార్టీ హాయంలో ఏర్పాటైన 33 జిల్లాలను 23 జిల్లాలకు కుదించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లాల పున: వ్యవస్థీకరణ ఉంటుందని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లోక్ సభ నియోజకవర్గం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ దిశగా కాంగ్రెస్ ఇప్పుడు ముందు వెళ్తున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. Telangana

Also Read: Jagan: చంద్ర‌బాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ భారీ స్కెచ్ ?

https://www.facebook.com/groups/1604244806529212/permalink/4360451494241849/?rdid=ydTV2FQJ7UaYkTsR&share_url=https%3A%2F%2Fwww.facebook.com%2Fshare%2Fp%2F1ArB6N1D3H%2F#

Share your love