Telangana: తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే..ఏ రోజున పోలింగ్ అంటే ?

Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వైరల్ గా మారింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయని చెబుతున్నారు.Telangana

This is the schedule for the Telangana municipal elections

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 16వ తేదీన అంటే సంక్రాంతి తర్వాత కనుమ రోజున షెడ్యూల్ విడుదల చేస్తారు. జనవరి 18, 19, 20 తేదీలలో నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. జనవరి 21వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. Telangana

Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

అలాగే జనవరి 23వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందట. జనవరి 24వ తేదీన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు చేస్తారు. పార్టీల తరఫున నుంచి పోటీ చేసే వాళ్లకు కాకుండా ఇండిపెండెంట్ క్యాండెట్లకు గుర్తులు ఇస్తారు. జనవరి 25వ తేదీ నుంచి ప్రచారం మొదలు పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రచారం కొనసాగుతుంది. ఫిబ్రవరి మూడవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. Telangana

Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

Share your love