Venu Swamy: వివాదంలో అల్లు అర్జున్.. వేణు స్వామి పై ట్రోల్స్..?
Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులకు ఏ విధమైన గుర్తింపు ఉందో జతకాలు చెప్పే వేణుస్వామికి కూడా అంతటి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఏదో నీటిలో రాయి వేసినట్టు కొన్ని కొన్ని విషయాలు ముందుగానే చెప్పి ఉంచుతారు. అవి చెప్పినట్టు జరిగితే నేను చెప్పింది నిజమైంది కదా అంటూ ఉంటారు. అలా ఆయన చెప్పిన ఒకటి రెండు విషయాలు అనుకోకుండా నిజమవ్వడంతో వేణుస్వామి చెప్పేది నిజమే అంటూ చాలామంది ఆయనను ఒక దేవుడిలా కొలిచారు.
Allu Arjun in controversy Trolls on Venu Swamy
కొంతమంది హీరోయిన్స్ అయితే ఆయనతో పూజలు చేయించుకుంటే కెరియర్ లో సెట్ అవుతామని చెప్పి అనేక పూజలు చేయించుకున్నారు. నటులు, రాజకీయ నాయకుల మైనస్ లను పట్టుకుని వేణుస్వామి బాగా సంపాదించారు. కానీ అలాంటి వేణు స్వామి ఈమధ్య ఏది చెప్పినా దానికి రివర్స్ అవుతుంది. దీంతో సోషల్ మీడియా, మెయిన్ మీడియా వేదికగా వేణు స్వామిని తిట్టిపోస్తున్నారు. అయితే ఆ మధ్యకాలంలో వేణు స్వామి అల్లు అర్జున్ గురించి కూడా చెప్పారు. (Venu Swamy)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన ఏసీపీకి షాక్.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.?
ఆయనకు 15 సంవత్సరాల పాటు రాజయోగం ఉందని ఏ సినిమా చేసిన బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్టుగానే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. తాజాగా పుష్ప2 కూడా అద్భుతమైన హిట్ సాధించింది. కానీ ఈ సినిమా వల్ల వివాదం మాత్రం దారుణంగా తయారైంది. సినిమా చూడడానికి వచ్చిన రేవతి చనిపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..
అయితే ఆయనకు 15 సంవత్సరాలపాటు అద్భుతమైన రాజయోగం ఉందని చెప్పిన వేణు స్వామిని కొంతమంది తిడుతూ ఇదేనా రాజయోగం అంటే, అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడమేనా ఆయనకున్న అదృష్టం అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేకాకుండా వేణు స్వామి నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాతకాలు చెప్పడం మానుకో లేదంటే నీ జాతకం మేము చెప్పాల్సి వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీంతో అయినా వేణుస్వామి సైలెంట్ గా ఉంటారా లేదంటే అలాగే చెబుతూ బోల్తా పడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Venu Swamy)