CM REVANTH REDDY : వ‌ద్దంటే మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్ట్ ఆపేస్తా.. సీఎం రేవంత్ సెన్షేష‌న్ కామెంట్స్

cm revanth reddy
cm revanth reddy

CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. అవును నిజమే రియల్ ఎస్టేట్ కోసమే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు వద్దంటే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఆపేస్తాన‌ని తెలిపారు. మూసీకి అటో కిలోమీటర్ ఇటో కిలోమీటర్ నేను ఆక్రమించి జేసీబీ తీసుకొని కూలగొడ్తా అంటున్నారు. ఇవాళ మూసీ ప్రాజెక్ట్ అడ్డుకునే వాళ్లకు నది ఒడ్డున ఒక్క నెల రోజులు అక్కడ ఉండండి అని చెప్పారు.

Moosi beautification project will be stopped… CM Revanth’s sensational comments

"నేను పూర్తిగా మారిపోయాను నమ్మండి. నేను నా పని విధానం మార్చుకున్నాను. ప్రజలు ఇన్నాళ్లూ నాలో ఒక కోణాన్నే చూశారు. మీకు తెలుసు నేను రాజకీయ వేదికల మీద చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతాను అని. కానీ ఇవ్వాళ మీకు నాలో ఇంకో కోణం చూపించాలని వచ్చాను. ఇవ్వాళ నాకు ఒక బాధ్యతాయుతమైన పదవి వచ్చింది. నేను నా మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు తీర్చాలి. నేను ఉట్టిగనే కూర్చుంటే నడవదు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Mojtaba Khamenei: ఇరాన్ కాబోయే సుప్రీం లీడర్ మోస్తా కమేనీ కోమాలో ఉన్నారా? నెతన్యాహు మరణం వార్తల్లో నిజమెంత?

మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్ట్ ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని.. ఎవ‌రి ఆస్తులు గుంజుకోవడానికే ఈ ప్రాజెక్ట్ చేప‌ట్ట‌లేద‌ని తెలిపారు. పేద‌ల‌కు న‌ష్టం క‌లిగించేలా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల ప్ర‌యోజ‌నాల కోసం తాము ప‌ని చేయ‌డం లేద‌న్నారు. ఈ ప్రాజెక్ట్ వ‌ల్ల ఏఒక్క పేద‌వాడికీ అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని, ఎవ‌రినీ నిరాశ్ర‌యుల‌ను చేయ‌బోమ‌ని భ‌రోసా ఇచ్చారు. భ‌విష్య‌త్ త‌రాల కోసం ఈ ప్రాజెక్ట్ చేప‌డుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.

Also Read : LPG Crisis: భారత్‌లో వంట గ్యాస్ కష్టాలు.. కేవలం 15 రోజులకు సరిపడా నిల్వలేనా?