
TGSRTC : తెలంగాణలో మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది అనే చెప్పవచ్చు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె కి సంబంధించిన నోటీస్ అందించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీస్ అందజేయడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు అందజేసినట్టు జేఏసీ నాయకులు తెలిపారు.
Strike siren sounded in Telangana RTC.. JAC leaders gave strike notices
ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు బస్సు భవన్ లో అధికారులను కలిసారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్ మెంట్ తో అమలు చేయాలని డిమాండ్ చేసారు.
సమ్మె నోటీసుల్లో ఆర్టీసీ కార్మికులు కీలక డిమాండ్లను ప్రస్తావించారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెల అందించే నిధులను కోత లేకుండా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరపున ఆర్టీసీ కి రావాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత తో పాటు ట్రేడ్ యూనియన్ల పై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కోరారు. అన్ని కేటగిరిల్లోని సిబ్బంది పై అధిక పని భారం తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read : BJP Strategy: జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హవా.. దక్షిణాది ఎన్డీఏ బాధ్యతలు ఆయనకేనా?




















