Sai Pallavi: “ఎల్లమ్మ”గా మెప్పించబోతున్న సాయి పల్లవి.. జోడి కుదిరేనా.?
Sai Pallavi: తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎంతో మంది కురకారుని ఫిదా చేస్తున్నా ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్రకారుకి ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆమెనేనండి సాయి పల్లవి.. తెలుగింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి.. ఇప్పటివరకు ఎలాంటి బోల్డ్ పాత్రల్లో నటించని ఈమె నాచురల్ గా ఎలాంటి మేకప్ లు వేసుకోకుండానే తన యాక్టింగ్ తోనే అందరి హృదయాలు గెలుచుకుంది.
Sai Pallavi who is going to impress as “Ellamma Movie”
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా బలగం వేణు దర్శకత్వంలో వస్తున్న ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ సినీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు హీరో హీరోయిన్లు ఫిక్స్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.చిన్న డైరెక్టర్ అనే చిన్న చూపో లేక మరే కారణమో తెలియదు.(Sai Pallavi)
Also Read: Sridevi: శ్రీదేవిని మోసం చేసిన బోనీ కపూర్.. ఆరు నెలలు దూరం..?
కానీ మొదట ఈ సినిమాలో నానిని హీరోగా తీసుకున్నాడు డైరెక్టర్ బలగం వేణు. కానీ నాని ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎల్లమ్మ మూవీలో నితిన్ హీరోగా ఫిక్స్ అయ్యారు.అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..బలగం వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వచ్చే ఏడాది వేణు ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా అమరన్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సాయి పల్లవి వచ్చే ఏడాది తండేల్ మూవీతో పలకరించబోతుంది. అలాగే ఎల్లమ్మ సినిమాలో కూడా ఈ హీరోయిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.(Sai Pallavi)