క్రికెట్‌తో పాటు ఉన్నత విద్యను కొనసాగిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. డెలాయిట్ ఉద్యోగాన్ని వదిలి క్రికెట్ ఎంచుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

Venkatesh Iyer More Than Just A Cricketer he is currently pursuing a PhD in Finance.
Venkatesh Iyer : క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే అపారమైన కృషి, పట్టుదల, సమయం అవరం. అందుకే చాలా మంది క్రీడాకారులు చదువును మధ్యలోనే నిలిపివేసి పూర్తిగా తమ ఆటపైనే దృష్టి పెడుతూ ఉంటారు. భారత క్రికెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పలువురు దిగ్గజ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించినప్పటికీ, ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయారు. అయితే ఈ ధోరణికి భిన్నంగా క్రికెట్‌తో పాటు చదువులోనూ సమానంగా రాణిస్తున్న అరుదైన ఆటగాళ్లలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రత్యేకంగా నిలిచాడు.
వెంకటేశ్ అయ్యర్ విద్యాభ్యాసం ఎంతో మందికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఇండోర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి బీకామ్ పూర్తి చేసిన ఆయన, అనంతరం దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో ఎంబీఏ పట్టా సాధించాడు. అంతేకాకుండా సీఏ ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడయ్యాడు. చదువులో అతని ప్రతిభకు గుర్తింపుగా ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లో 15 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కూడా లభించింది.
FIFA World Cup 2026 : మెక్సికో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు వయాగ్రా!
అయితే చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఉన్న ఆసక్తి కారణంగా ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఐపీఎల్, దేశీయ క్రికెట్, భారత జట్టుకు ఆడుతూ విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నప్పటికీ, చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్డీ చేస్తూ మరో అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే డాక్టర్ వెంకటేశ్ అయ్యర్ గా గుర్తింపు పొందనున్నాడు.
వెంకటేశ్ అయ్యర్ ప్రయాణం యువ క్రీడాకారులకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఆటలో విజయం సాధించాలనే లక్ష్యంతో పాటు విద్యకు కూడా సమానంగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన నిరూపించాడు. ప్రతి ఒక్కరికీ క్రీడల్లో దీర్ఘకాలిక కెరీర్ దక్కకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో విద్యే భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలుస్తుంది. అందుకే క్రీడలు, చదువు రెండింటినీ సమతుల్యంగా కొనసాగించాలని నిపుణులు సూచిస్తుండగా, వెంకటేశ్ అయ్యర్ అందుకు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నాడు.

















