
Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్ స్థాయికి వెళ్ళాడు. అయితే అలాంటి శ్రేయాస్ అయ్యర్, ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తో రిలేషన్ లో ఉన్నాడట ఆ శ్రేయాస్ అయ్యర్. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు ఫారన్ ట్రిప్ కూడా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. Shreyas Iyer
Reports spill the wildest rumour about Shreyas Iyer and Mrunal Thakur
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ సమయం నుంచి ఇద్దరు మధ్య పరిచయం పెరిగిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి వివాహం కూడా జరగబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే వీళ్ల వివాహానికి దాదాపు మరో ఏడాది కాలం పడుతుందని చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Shreyas Iyer
Also Read: KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?
ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల కాలంలో శ్రేయాస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఇచ్చిన క్యాచ్ అందుకోబోయి, కిందపడ్డాడు శ్రియాస్ అయ్యర్. దీంతో అతని పక్కటెముకల వద్ద ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. దీంతో అప్పటి నుంచి శ్రేయాస్ అయ్యర్ టీమిండియా జట్టుకు దూరమై రెస్ట్ తీసుకుంటున్నాడు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సమయానికి అందుబాటులోకి శ్రేయాస్ అయ్యర్ వచ్చే ఛాన్స్ ఉంది. Shreyas Iyer
Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వచ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి




















