నిజామాబాద్‌లో ఓ భర్త ప్రశాంత్‌ను అతని భార్యే హార్పిక్ ఎక్కించి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంధ్య అనే భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని.. తన భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ హార్పిక్ కేసులో పోలీసుల విచారణలో ఓ ఆడియో కూడా బయటపడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంధ్య ముందుగా భర్తకు బాగా మందుపట్టించి.. మత్తు ఎక్కువైందనుకొని మేడ మీద నుంచి తోసేసింది. కానీ ఆ ప్రమాదంలో ప్రశాంత్ బతికిపోవడంతో ఆమె మరింత క్రూరమైన ప్లాన్ వేసింది. ఒక హార్పిక్ బాటిల్ తెచ్చి ఆ లిక్విడ్‌ను సిరంజిలో నింపి భర్త నరాల్లోకి ఎక్కించి హత్య చేసింది. ఈ దారుణాన్ని తన ప్రియుడు బంటి సాయంతో సాధించింది.
పోలీసుల దర్యాప్తులో లభించిన ఆడియోలో సంధ్య తన ప్రియుడితో మాట్లాడుతూ “బాగా తాగించి పడుకోబెట్టు, అతను నిద్రలోకి జారకపోతే ఇంకా మందు తెప్పించు” అని చెప్పింది. ఆమె ఈ ప్లాన్‌ని బాగా ముందుగానే రచించిందని స్పష్టమవుతోంది. ఈ హార్పిక్ హత్య కేసులో ఇది కీలక ఆధారంగా మారింది.
ప్రస్తుతం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భర్త నరాల్లో హార్పిక్ ఎక్కించి హత్య చేసిన ఈ ఘటన నిజామాబాద్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. భార్య ఇంత కిరాతకంగా ప్రవర్తించడం అందరినీ షాక్ చేసింది.





