తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ మూవీ మందాడి సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల చుట్టూ తెరకెక్కింది. సెల్ఫీ మూవీ ఫేం మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తుండగా, తమిళ నటుడు సూరి కుడా ఇందులో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, లాంగ్ హెయిర్ తో సుహాస్ న్యూ లుక్ నెట్టింట వైరల్ గా మారాయి.
Mandadi Movie Creates Buzz with Suhas Stylish Look
సుహాస్ సాట్టపులి పాత్రలో మేకింగ్ వీడియోలో స్టైలిష్ గాగుల్స్ తో సిగరెట్ వెలిగిస్తూ కనిపించడం ఫ్యాన్స్ ను ఎక్జైట్ చేస్తోంది. ఈ లుక్ ద్వారా అతని క్యారక్టర్ కి పచ్చని రావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సుహాస్ కు సౌత్ ఇండియన్ మార్కెట్ లో మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఫ్యాన్స్ కన్ఫిడెంట్ గా ఉన్నారు.
మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎక్జయిటింగ్ అప్‌డేట్ రాబోతుందని మేకర్స్ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటనేది తెలియాలంటే రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే.
సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానున్న మందాడి సినిమా సుహాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఫ్యాన్స్ అందరూ ఈ మందాడి మూవీ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అవడం మరింత ఎక్జైట్ ను క్రియేట్ చేస్తోంది.





