Venuswamy: ఎన్టీఆర్ సీఎం అవుతారా? వేణుస్వామి జాతక విశ్లేషణ వైరల్

సెలబ్రిటీ జాతకాలతో రెగ్యులర్ గా వైరల్ అయ్యే వేణుస్వామి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను కాబోయే సీఎం అని ప్రిడిక్ట్ చేయడం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కామెంట్స్ నెటిజన్ల ను షాక్ కి గురి చేశాయి.

వేణుస్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన సెలబ్రిటీల గురించి డిటైల్ గా చెప్పారు. ఈ లిస్ట్ లో మోదీ ని కారణజన్ముడు అని, విజయ్ దేవరకొండ ని కష్టపడే నటుడు అని, ప్రభాస్ ని కూడా కారణజన్ముడు అని అన్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి ని తెలంగాణ తోపు అని, కేసీఆర్ ని తెలంగాణ జాతిపిత అని కూడా అభివర్ణించారు.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వేణుస్వామి జూనియర్ ఎన్టీఆర్ ని కాబోయే ముఖ్యమంత్రి అని, పవన్ కళ్యాణ్ ని పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని, చంద్రబాబు నాయుడు ని గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని పేర్కొనడం. ఈ కామెంట్స్ నేరుగా వైరల్ అయ్యాయి, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో రాజకీయాల్లోకి వస్తారనే కాన్ఫిడెంస్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోయినా, అతని ఫ్యాన్స్ మాత్రం ఆయన ని సీఎం గా చూడాలని కోరుకుంటున్నారు. ఈ ప్రిడిక్షన్ తో ఇప్పుడు ఆ డిమాండ్ మరింత బలపడింది.

Share your love