Kotta Cinema : ‘మేము కూడా సినిమా తీసినామురో..’ సాంగ్ రిలీజ్

‘కొత్త సినిమా’ పేరుతో ఓ ఫ్రెష్ మూవీ రూపొందుతోంది. ఇందులో సురేశ్, రాకేష్ హీరోలు. రామగుండం, గోదావరిఖని, సింగరేణి లాంటి లోకల్ ఏరియాలు బ్యాక్డ్రాప్గా దీని షూటింగ్ జరిగింది. అజర్ డైరెక్ట్ చేస్తున్న ఈ కొత్త సినిమా నిర్మాతలు వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, సతీష్ యాదవ్. తాజాగా ‘మేము కూడా సినిమా తీసినామురో’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్కి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి, నటుడు ఆర్కే సాగర్ హాజరయ్యారు. చరణ్ అర్జున్ ఈ పాట రాసి, కంపోజ్ చేసి పాడారు.

డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ, తాము భూమి లోతుల నుంచి వచ్చామని, సింగరేణి బొగ్గు బాయిల్లో ఎదిగామని చెప్పారు. ఈ కొత్త సినిమా ద్వారా వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక టాలెంట్ను ప్రోత్సహించాలనే తన కల ఇది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, అజర్ లోకల్ ఫీల్తో కంటెంట్ను అందరికీ నచ్చేలా రూపొందించాడని ప్రశంసించారు. సినిమా టైటిల్కు తగ్గట్టే ఇది కొత్తగా ఉంటుందని చెప్పారు.

‘మేము కూడా సినిమా తీసినామురో’ పాట లిరిక్స్ రైటర్, కంపోజర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ, గోదావరిఖని వరకు తన మ్యూజిక్ వెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ వచ్చి తమ కలలు నెరవేర్చుకోలేని యూత్ ఆవేదన ఈ పాటలో ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ అజర్ తన నాన్న సజెస్ట్ చేసిన పేరుతో ఈ పాట చేశానని వివరించారు.

నటుడు ఆర్కే సాగర్ మాట్లాడుతూ, అజర్ తండ్రి హుస్సేన్ తన 40 ఏళ్ల పీఎఫ్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఇచ్చారని చెప్పారు. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కొత్త సినిమా మేడిన్ గోదావరిఖనిగా నిలిచిందని అన్నారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ, స్థానిక ఫిలిం మేకర్లకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Share your love