కోలీవుడ్ స్టార్ నటుడు జయం రవి తన సినీ ప్రయాణాన్ని కొత్త ఉత్సాహంతో మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వ్యక్తిగత వివాదాలతో గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచిన జయం రవి, తాజాగా ఓ ఈవెంట్‌లో భావోద్వేగంగా మాట్లాడుతూ తన అభిమానులకు పబ్లిక్‌గా apology చెప్పారు. ఇది నాకు రెండో జన్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
గత కొంతకాలంగా జయం రవి వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అయింది. భార్య ఆర్తితో విభేదాలు, సింగర్ కెనీషాతో పేరు వినిపించడం, దానిపై వచ్చిన ట్రోలింగ్ వంటివి ఆయనను చాలా ఇబ్బంది పెట్టాయి. ఓ దశలో సినిమాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించిన జయం రవి, తన కెరీర్‌కు బ్రేక్ పడిందా అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ముందుకు రావడం విశేషం.
తన ప్రసంగంలో జయం రవి ఎమోషనల్‌గా మాట్లాడారు. మీ ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నా వల్ల ఎవరికైనా నిరాశ కలిగితే క్షమించండి. ఇక నుంచి నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంటుంది అంటూ చెప్పారు. గతాన్ని వదిలేసి కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో తన కెరీర్‌ను కొత్తగా మొదలుపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జయం రవి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం జయం రవి స్వీయ నిర్మాణంలో బ్రో కోడ్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆయన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నారు. ఇకపై గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త ఆరంభంతో జయం రవి అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.





