రావణ్ కేసులో వైసీపీ ఎంట్రీ.. పొన్నవోలు వ్యూహం ఏంటి?

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో రావణ్కు ఊరట దక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇతర నేతలపై దూషణలు చేసిన జోసెఫ్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలతో ఉపా చట్టం కింద కేసులు నమోదు కావడంతో అతని పరిస్థితి కష్టంలో పడింది. ఇప్పుడు వైసీపీ నేరుగా రంగంలోకి దిగి, తమ సీనియర్ న్యాయవాది పొన్నవోలును రావణ్ కోసం పంపింది. దీనితో రావణ్కు ఊరట దొరుకుతుందా లేదా అనే చర్చ మొదలైంది.

వైసీపీ గతంలో రావణ్ వెనుక ఉందన్న విషయాన్ని దాచినా, ఇప్పుడు పొన్నవోలును ఫీల్డ్లోకి దించడంతో తమ పాత్రను స్పష్టంగా తెలియజేసింది. అయితే, పొన్నవోలు గతంలో చేసిన వాదనలు ఎక్కువగా కోర్టుల్లో విజయవంతం కాలేదు. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కేసులో ఆయన వాదనలు అడ్డంగా విఫలమయ్యాయి, దాంతో పోసాని రోజుల తరబడి జైల్లో గడపాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు అరెస్టు విషయంలోనూ పొన్నవోలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో పొన్నవోలు వాదనలతో రావణ్కు కూడా పెద్దగా లాభం ఉండదనే అభిప్రాయం బలంగా ఉంది.

మొత్తంగా చూస్తే, పొన్నవోలు తన కెరీర్లో విజయవంతమైన కేసుల కంటే విఫలమైన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి, అక్కడ అభాసుపాలైన సంఘటన తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ విఫల చరిత్రతో పొన్నవోలు వాదనలతో రావణ్కు ఊరట దక్కడం కష్టమేనని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అసలు పొన్నవోలు వాదనలతో రావణ్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా లేకపోలేదు.

ఇప్పుడు రావణ్ కేసు తదుపరి విచారణ ఎలా జరగబోతుందో చూడాలి. పొన్నవోలు ఎంట్రీతో రావణ్ బెయిల్ దక్కించుకుంటాడా, లేదా మరిన్ని ఇబ్బందుల్లో పడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విఫలం అయితే, వైసీపీకి ఇది మరో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ కేసు ఫలితం ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ను సృష్టించే అవకాశం ఉంది.

Share your love