రూ.1.80 కోట్ల బకాయిలు: నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదు

ప్రముఖ తమిళ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఆయన నటిస్తున్న ‘అనంతన్ కాడు’ సినిమా షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్న కెమెరాలు, లైటింగ్ పరికరాలకు బకాయిలు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం రూ.1.80 కోట్లకు పైగా డ్యూస్ మిగిలి ఉన్నాయి.

ఈ విషయంలో జూబ్లీహిల్స్ వెంకటగిరి ప్రాంతంలోని ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ప్రకారం, ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ కలిసి ఖరీదైన డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు అద్దెకు తీసుకున్నారు. మొత్తం అద్దె రూ.2.12 కోట్లు కాగా, షూటింగ్ పూర్తయిన తర్వాత రూ.1.80 కోట్లు చెల్లించలేదు.

సినిమా రిలీజ్ సమయంలో మొత్తం డ్యూస్ క్లియర్ చేసి no dues certificate తీసుకుంటామని లిఖితపూర్వకంగా ఒప్పుకున్నా, ఆ తర్వాత ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్లకు స్పందించలేదు. సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ ఫిర్యాదు ప్రకారం, డ్యూస్ గురించి మాట్లాడిన మేనేజర్‌ను నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య అసిస్టెంట్ కిషోర్ బెదిరించినట్లు తెలిసింది. వీరు కేరళ కోర్టు నుంచి ఇంటరిం ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు.

చీటింగ్ కేసు నమోదైన ఈ వివాదంలో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతోంది. బాధిత సంస్థ వారి డ్యూస్ రికవరీ కోసం పూర్తి ఎత్తుగడలో ఉంది. ఈ సంఘటన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.

Share your love