స్టైలిష్ ఎమ్మెల్యే బాలయ్య: పొక్లెయిన్ తో కాలువ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన స్టైలిష్ అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. బాలయ్య ఈసారి భారీ పొక్లెయిన్ ఎక్స్కవేటర్ నడిపి హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.790 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు రాచపల్లి గ్రామం వద్ద బాలయ్య స్వయంగా మట్టి తొలగించి ప్రారంభించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాలయ్య ఈ పొక్లెయిన్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజలు, రైతులు, కార్యకర్తలు అందరూ ఆయన ఆక్షన్ ను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభంలో ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య, ఈసారి భారీ యంత్రాన్ని నడపడం ద్వారా తనదైన టచ్ ను మరోసారి చూపించారు.

ప్రజా కార్యక్రమాల్లో వాహనాలు నడపడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. గతంలో డీఎస్సీ విజేతల నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ఇతర ఎమ్మెల్యేలను బస్సులో వేదిక దగ్గరకు తీసుకెళ్లి ఆయన అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బస్సు తర్వాత పొక్లెయిన్ నడిపి బాలయ్య మరోసారి హెడ్లైన్స్ లో నిలిచారు.

హిందూపురం ప్రజలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం చాలా ముఖ్యం. బాలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు తన సపోర్ట్ ను చూపించారు. ఈ మాస్ హీరో సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండటం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Share your love