నాగ్ అశ్విన్ మౌనం వీడారు. తన బ్లాక్‌బస్టర్ మూవీ కల్కి 2898 AD పై వస్తున్న విమర్శలకు సర్ప్రైజింగ్గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా రిలీజ్ తర్వాత కర్ణుడి పాత్ర గురించి ట్రోల్స్ మొదలయ్యాయి. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సింపుల్‌గా ఒకే సలహా ఇస్తున్నారు: “మహాభారతం చదవండి, కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.” నాగ్ అశ్విన్ ఈ కామెంట్‌తో తన ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేశారు.
సినిమాలో కర్ణుడి పాత్రను ఓవర్ గ్లోరిఫై చేశారని, ఒరిజినల్ మహాభారతానికి భిన్నంగా చూపించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి జవాబుగా నాగ్ అశ్విన్ ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేబ్రాయ్ అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని షేర్ చేశారు. ఇది ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలని స్పష్టం చేశారు. నాగ్ అశ్విన్ స్టేట్మెంట్ ప్రకారం, కర్ణుడి పాత్రపై వచ్చిన కామెంట్లన్నీ తప్పు దృక్పథంతో చెప్పినవే. తను ఏం చేస్తున్నాడో పూర్తిగా తెలుసని, చరిత్రపై గౌరవం ఉందని ధీమాగా చెప్పారు.
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’లో విజువల్స్, యాక్షన్ సీన్స్, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మిగిలిపోతాయి. అయినా కర్ణుడి పాత్ర డిపిక్షన్ మీద చర్చ రిలీజ్ నుంచే ఉంది. ‘లెనిన్’ రిలీజ్ అయ్యాక ఈ చర్చ మరింత హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తన పోస్ట్‌తో ఆ వివాదాన్ని సైలెన్స్ చేస్తూ, ఫోకస్ ని కల్కి పార్ట్ 2 పైకి మళ్ళించారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. కర్ణుడి క్యారెక్టర్ ని ఎలా డెవలప్ చేస్తారు? మహాభారతంలోని మరిన్ని ఎలిమెంట్స్ ఎలా షో చేస్తారు? అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నాగ్ అశ్విన్ ఒక్క మాటతోనే అభిమానుల్లో మరింత క్రేజ్ క్రియేట్ చేశారు. మరి ఈ కల్కి పార్ట్ 2 ఏ మేజిక్ చేస్తుందో చూడాలి.





