తమిళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన బ్రేకప్ నిర్ధారణ చేసినట్లు తాజా పోస్ట్ తో సంచలనం సృష్టించింది. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో తనకున్న relationship నుంచి బయటపడ్డానని, అతను తన career మరియు personal విషయాలలో అతిగా control చేస్తున్నాడని ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Anupama Parameswaran Breaks Silence Over Breakup
ఇద్దరూ కలిసి ‘బైసన్’ తమిళ్ సినిమాలో నటించారు. షూటింగ్ సమయంలో వారి మధ్య close bond ఏర్పడింది. పార్టీలో lip kiss ఫోటో లీక్ అవడం, స్టేజీపై పుట్టినరోజు శుభాకాంక్షలు, సెల్ఫీలు షేర్ చేయడం వంటి events వల్ల వారి relationship గురించి ఊహాగానాలు వచ్చాయి. అయితే ధృవ్ తనని అన్ని విషయాలలో నియంత్రించడం మొదలుపెట్టాడని, అందుకే తను break up చెప్పానని అనుపమ వెల్లడించింది.
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఏమీ పోస్ట్ చేయని అనుపమ నిన్న ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. కొన్నిసార్లు మనశ్శాంతిని పొందాలంటే ఫలితం లేని దారులను వదిలేయాల్సిందే. ఇకపై నా గొంతుకను నేను ఎంచుకుంటాను. ఎవరి అనుమతులు అవసరం లేదు, భయం కూడా లేదు అంటూ రాసింది. ఈ పోస్ట్ ద్వారా ఎవరో తనని control చేస్తున్నారని, ఇప్పుడు ఆ control నుంచి తనను తాను విడిపించుకున్నానని స్పష్టం చేసింది.
అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో love, emotions గురించిన కోట్స్ కూడా షేర్ చేసింది. గతంలో ధృవ్ తో తీసుకున్న close సెల్ఫీలను కూడా డిలీట్ చేసింది. దీంతో అనుపమ-ధృవ్ బ్రేకప్ వార్త వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ అందరూ అనుపమకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ తనకు ఒక నూతన ఆరంభంగా ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.





