స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనల్ ట్రైలర్ ఇప్పుడే విడుదలైంది. మార్వెల్ స్టూడియోస్ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఓ పెద్ద gift ఇచ్చింది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా నాలుగో సోలో సినిమా ఇది. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
Spider-Man Brand New Day Review
ఈ ట్రైలర్లో పీటర్ పార్కర్ లైఫ్‌లో వచ్చిన పెను మార్పులు చూపించారు. ‘నో వే హోమ్’ తర్వాత అతన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఎలా బతుకుతున్నాడు, తన ప్రియురాలు MJతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపిస్తూ కొత్త twist ను add చేశాడు. టామ్ హాలండ్‌తో పాటు జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ఉన్నారు.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథను క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్‌కెస్ రాసారు. కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్ వంటి పెద్ద నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేశారు. ఈ కొత్త అడ్వెంచర్‌లో స్పైడర్ మ్యాన్‌కు ఏం జరుగుందో తెలుసుకోవాలంటే ఈ ట్రైలర్ తప్పక చూడాలి.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్లో చూపించిన ఎమోషన్స్ ను బట్టి ఈ సినిమా మార్వెల్ యూనివర్స్‌కు ఓ కొత్త లెవెల్ ను తీసుకురావడం ఖాయం.




