హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఓ software engineer అనుమానాస్పద మృతి చెందిన ఘటన కలకలం రేపింది. విష్ణువర్ధన్ అనే ఆ యువ ఇంజనీర్ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌లో ముంచేసింది.
Software Engineer అనుమానాస్పద మృతి
బుధవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విష్ణువర్ధన్, గురువారం ఉదయం తన అపార్ట్మెంట్ ground floorలో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌కి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేసిన విష్ణువర్ధన్ సోదరుడు నార్సింగ్, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి complaint మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ, మరికొన్ని డాక్యుమెంట్లను సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విష్ణువర్ధన్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తూ, ఇటీవలే తన కుటుంబంతో కలిసి ఇక్కడికి సెటిల్ అయ్యాడని తెలుస్తోంది.





