హైదరాబాద్లో child abuse ఘటన కలకలం రేపింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని స్థానికులు కొట్టేయడంతో అతడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూం బ్లాక్లో జరిగింది. 9 ఏళ్ల బాలికను అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి టార్గెట్ చేసి వేధించాడు.
Child Abuse: Crowd Turns Violent
అజీజ్ నిలోఫర్ ఆసుపత్రి దగ్గర టీ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవలే ఆ చిన్నారికి ముద్దులు పెట్టి, ప్రైవేట్ పార్ట్స్ తాకి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ సీన్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీడియో చూసిన బాలిక తల్లిదండ్రులు, మిగతా స్థానికులు పట్టరాని ఆగ్రహంతో రగిలిపోయారు.
ఆవేశంలో వాళ్లంతా కలిసి అజీజ్పై దాడి చేశారు. దెబ్బలకు తీవ్రంగా గాయపడిన అతడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.
దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించాం. వారిపై కఠినం చర్యలు తీసుకుంటాం అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనతో ఏరియాలో టెన్షన్ నెలకొంది. చిన్నారికి అలాంటి ట్రామా ఎదురైంది అన్న బాధలో కుటుంబం ఉంది. జస్టిస్ కోసం వారు ఎదురుచూస్తున్నారు.





