Salman Khan: సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ కు కౌంటర్.. స్టైలిష్ ఫొటోతో క్లారిటీ

Salman Khan looking at camera

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఇటీవల వచ్చిన రూమర్స్ ను ఫర్వాలేదన్నట్టు ఆయనే స్వయంగా కౌంటర్ ఇచ్చేశారు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో క్లీన్ షేవ్ తో, కాస్త డల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. బరువు తగ్గి, నీరసంగా ఉన్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, సల్మాన్ తన స్టైలిష్ ఫోటోతో అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు.

Salmans Health Update Photo

తన సోషల్ మీడియా ఖాతాలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశాడు సల్మాన్. ఈ లుక్ లో ఆయన ఎంతో స్టైలిష్ గా, కౌబోయ్ టోపీ పెట్టుకుని పోజులిస్తూ కనిపించాడు. ఫోటోతో పాటు, మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది? అనే క్యాప్షన్ ను కూడా పెట్టాడు. ఇది చూస్తే, తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఆయన లైట్ గా తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

ఇప్పటికే సల్మాన్ ఫ్యాన్స్ ఓ వైపు టెన్షన్ లో ఉన్నారు. కానీ, ఈ పోస్ట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. సల్మాన్ ఆరోగ్యం పూర్తిగా బాగానే ఉంది, ఆయన లుక్స్ మాత్రం కొన్ని ఈవెంట్స్ కోసం మారాయి అనే ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చాడు. Also Read : Akkineni Heros : ఒకే వేదికపైకి ముగ్గురు అక్కినేని హీరోలు.. లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం.. కానీ.. ఆప్ లోగోన్ కి తబియాత్ కైసీ హై ?

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోతో, సల్మాన్ ఖాన్ మళ్ళీ తన ఎనర్జీతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అని క్లార్ చేశాడు. ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్, సల్మాన్ లేడు, కానీ కంప్లీట్ గా ఫిట్.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu