Salman Khan: బిగ్ బ్రేకింగ్..సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా ప్రకటించిన దేశం.. కారణం.?

The country that declared Salman Khan a terrorist

Salman Khan: బాలీవుడ్ సల్మాన్ హీరో సల్మాన్ ఖాన్ ని ఉగ్రవాదిగా దేశం ప్రకటించింది. ఇదేంటి సల్మాన్ ఖాన్ ఉగ్రవాది ఏంటి.. ఆయన బాలీవుడ్ హీరో కదా అని చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే ఆయన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది మన భారతదేశం కాదు.పాకిస్తాన్..పాకిస్తాన్ తో సల్మాన్ ఖాన్ కి ఉన్న సంబంధం ఏంటి..ఆయన్ని పాకిస్తాన్ ఉగ్రవాదిగా ఎందుకు ప్రకటిస్తుంది అనేది చూస్తే..

The country that declared Salman Khan a terrorist

రీసెంట్ గా సల్మాన్ ఖాన్,అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ముగ్గురు సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం- 2025 ఈవెంట్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ బలుచిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వాళ్ళు చాలామంది సౌదీ అరేబియాలో కష్టపడి ఎంతో పని చేస్తున్నారని పొగిడారు.అయితే ఇందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు. కానీ తప్పు ఉంది.. అదేంటంటే.. బలుచిస్తాన్ స్వతంత్ర దేశం కాదు.అది పాకిస్తాన్లోనే కొనసాగుతోంది. (Salman Khan)

Also Read: Varun Tej: వరుణ్ తేజ్ పరువు తీసిన నెటిజన్స్.. ఘోర అవమానం.!

గత కొద్ది సంవత్సరాల నుండి పాకిస్తాన్ నుండి తమను వేరే దేశంగా ప్రకటించాలని బలుచిస్తాన్ వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ వాళ్ళు బలుచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా ప్రకటించడం లేదు. దీంతో రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇండియాకి సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ పై సమయం దొరికితే చాలు కాల్పుల వర్షం కురిపిస్తున్నారు.

The country that declared Salman Khan a terrorist

అయితే ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో పాకిస్తాన్ వాళ్ళు సల్మాన్ ఖాన్ పై మండి పడుతున్నారు. దీంతో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాసల్మాన్ ఖాన్ పై ఉగ్రవాదిగా ముద్ర వేసి నాలుగో షెడ్యూల్ లో ఆయన పేరును చేర్చారు. నాలుగో షెడ్యూల్ అంటే ఈ లిస్టులో ఉన్న వారందరూ ఉగ్రవాద నిరోధక చట్టం కిందికి వస్తారు.అలా పాకిస్తాన్ దేశం సల్మాన్ ఖాన్ పై ఉగ్రవాది ముద్ర వేశారు. కానీ స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలి అని పోరాడుతున్న బలుచిస్తాన్ నాయకులు మాత్రం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలని ప్రశంసిస్తున్నారు.(Salman Khan)

Share your love