అమెరికాలో ఏడేళ్లు నివసించిన H1B visa హోల్డర్లకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం తీసుకొచ్చే కొత్త బిల్లు సెనేట్‌లో వచ్చింది. ప్రస్తుతం బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న లక్షలాది భారతీయ టెక్ ప్రొఫెషనల్స్‌కు ఇది పెద్ద రిలీఫ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పడిల్లా ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టారు.
H1B visa relief for Indians
‘రిన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929’ పేరుతో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారితే, H-1B వీసాదారుల గ్రీన్ కార్డ్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. ప్రస్తుతం భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలపాటు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ కొత్త బిల్లు ఆ వేచి ఉండే టైమ్‌ను చాలా తగ్గిస్తుంది.
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ ప్రొఫెషనల్స్‌కు ఇది గేమ్ ఛేంజర్ లాంటిది. ఇప్పటివరకు కేవలం వీసా రెన్యూవల్ చేసుకుంటూ ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం సింపుల్ మార్గం ఓపెన్ అవుతుంది. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే ఇమ్మిగ్రేషన్ చట్టంలో పెద్ద మార్పు వచ్చినట్లే లెక్క.
భారతీయ టెక్ నిపుణులు, వారి కుటుంబాలు ఈ అప్డేట్ను ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ ఏడాది లేదా 2026లోగా ఈ బిల్లు పాస్ అవుతుందా అనే ఆశలు కూడా కొందరికి ఉన్నాయి. కొత్త అడ్మినిస్ట్రేషన్ కూడా లీగల్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను ఈజీ చేయడానికి ఆసక్తి చూపిస్తుందని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/pakkafilmy007/status/1600352362639822848





